భౌతిక దూరం కోసం.. వైన్స్ షాపు ఆలోచన చూసి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా!

  • కరోనాతో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
  • ఓ పెద్ద గొట్టాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా లావాదేవీలు
  • ఈ ఆలోచనను నవీకరించాలన్న ఆనంద్ మహీంద్రా
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రతి చోటా భౌతిక దూరం పాటించడం తప్పనిసరైన నేపథ్యంలో, ఓ వైన్ షాపు యజమానికి వచ్చిన ఆలోచన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసింది. కరోనా కాలంలో మానవ జీవితంలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు సంభవించాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం, వస్తువులు తీసుకోవడంలో భౌతిక దూరం పాటించడం కాస్తంత కష్టమే అవుతున్న వేళ, ఓ మద్యం షాపు యజమాని కాంటాక్ట్ లెస్ వ్యాపారం కోసం వినూత్న ఆలోచన చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన ఆనంద్ మహీంద్రా, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తన షాపు ముందు పెద్ద గొట్టాన్ని ఏర్పాటు చేసిన యజమాని, దానిలోకి ఓ తాడు సాయంతో సీసాను జారవేయడం, దానిలో డబ్బు పెట్టగానే, తీసుకుని, అడిగిన సరుకును ఇవ్వడం చేస్తున్నాడు. ఈ ఐడియాను మరింత నవీకరిస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.


More Telugu News