మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ దిశగా ... మోదీ నిర్ణయం తీసుకుంటారా?

  • నేడు, రేపు సీఎంలతో సమావేశాలు
  • ఆపై కీలక నిర్ణయం తీసుకోనున్న మోదీ
  • మరోసారి లాక్ డౌన్ ఖాయమంటున్న అత్యధికులు 
  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ, నేడు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆన్ లైన్ మాధ్యమంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం తరువాత, మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ ను విధిస్తారని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, కరోనాను నివారించాల్సిన చర్యల గురించి రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమే మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఇప్పటికే పీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

ఈ రెండు రోజుల సమావేశాల అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.. ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడకున్నా, మోదీ మాట్లాడటం లేదా మీడియా ద్వారా ప్రకటన విడుదల చేయడం ఖాయంగా తెలుస్తోంది.

ఇండియాలో మరోసారి లాక్ డౌన్ ఖాయమేనని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకోవడంతో, కేసుల సంఖ్యను తగ్గించాలంటే, లాక్ డౌన్ ఒక్కటే మార్గమని, మరోమారు ప్రజా రవాణాలను, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనులను నిలిపివేస్తే, ప్రజలు ఇంటికే పరిమితమవుతారని, తత్ఫలితంగా కేసుల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.


More Telugu News