కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త ముప్పు.. తాజా అధ్యయనం వెల్లడి!
- డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్న పరిశోధకులు
- కరోనా వైరస్ తో జీవక్రియలు దెబ్బతింటాయని వెల్లడి
- గ్లూకోజ్ స్థాయుల్లో వైరుధ్యం కనిపిస్తుందని వివరణ
ఇప్పటికిప్పుడు ప్రపంచంలో అత్యంత భయానక వ్యాధి ఏంటంటే కరోనా మహమ్మారి అనే చెబుతారు. కరోనా వైరస్ కారణంగా కలిగే లక్షణాలు సాధారణ జలుబు లక్షణాలనే పోలి ఉన్నా, కొద్ది వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారడం ఈ వైరస్ నైజం. కరోనా నుంచి కోలుకున్న వారిని అదృష్టవంతులుగా భావిస్తున్న ఈ తరుణంలో, అంతర్జాతీయ డయాబెటిస్ నిపుణుల బృందం ఆందోళన కలిగించే అంశం వెల్లడించింది.
కరోనా మరణాల్లో మధుమేహ రోగుల శాతం 20 నుంచి 30 వరకు ఉందని తెలిపింది. అంతేకాదు, కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామందికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఈ బృందం చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. మోనాష్ విశ్వవిద్యాలయంలో డయాబెటిస్ ప్రొఫెసర్ పౌల్ జిమ్మెంట్ కూడా ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా కరోనా బాధితులపై పరిశీలన చేపట్టారు. వారిలో శరీరంలో చక్కెర స్థాయిని విశ్లేషించారు.
ఈ వైరస్ రెండు రకాలుగా ప్రమాదకారి అని, డయాబెటిస్ ఉన్నవాళ్లకు మరింత ముప్పు కలిగిస్తుందని, లేనివాళ్లకు డయాబెటిస్ కలిగిస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. కరోనా వైరస్ కారణంగా శరీర జీవక్రియల లయ దెబ్బతినడమే కాకుండా, గ్లూకోజ్ స్థాయుల్లో విపరీతమైన వైరుధ్యం ఏర్పడుతుందని గుర్తించారు. టైప్-1 డయాబెటిస్ ను కలిగిస్తుందా, లేక టైప్-2 డయాబెటిస్ ను కలిగిస్తుందా? అన్నదానిపై స్పష్టత లేకపోయినా, కరోనా నుంచి కోలుకున్నవారిలో ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.