జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ పై విరుచుకుపడ్డ చింతమనేని ప్రభాకర్

  • జగన్ కు, ధృతరాష్ట్రుడికి తేడా లేదు
  • నాపై అక్రమ కేసు బనాయించారు
  • ఈ కేసుపై హైకోర్టులో పోరాడతా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు, మహాభారతంలోని ధృతరాష్ట్రుడికి ఏమాత్రం తేడా లేదని అన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆందోళన చేయడానికి వెళ్లిన తనను పోలీసులు వారించారని... ఆందోళన కార్యక్రమాలు వద్దని చెప్పారని, వెంటనే తాను తిరిగి వచ్చేస్తుంటే పోలీసులు కావాలని అరెస్ట్ చేశారని చెప్పారు.

తనపై అక్రమ కేసు బనాయించారని, దీనిపై హైకోర్టులో పోరాడుతానని తెలిపారు. అచ్చెన్నాయుడిపై కూడా అక్రమ కేసు పెట్టి, అరెస్ట్ చేశారని విమర్శించారు. ఆపరేషన్ జరిగిందని అచ్చెన్న చెప్పినా వినకుండా తీసుకొచ్చారని అన్నారు. 14 రోజుల రిమాండ్ లో ఉన్న చింతమనేనికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News