ఆన్ లైన్ చెల్లింపుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సీబీఐ

  • కరోనా పేరిట మోసగాళ్లు చెలరేగిపోతున్నారన్న సీబీఐ
  • ఆన్ లైన్ లో ముందస్తు చెల్లింపులు చేయవద్దని స్పష్టీకరణ
  • ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడి
కరోనా పరికరాల పేరిట సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారంటూ సీబీఐ అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. ఆన్ లైన్ లో ముందస్తు చెల్లింపులు చేయవద్దంటూ ప్రజలకు సూచించింది. కొవిడ్ పరికరాల పేరిట ముందస్తు చెల్లింపులకు సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తారని, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని సీబీఐ వెల్లడించింది. శానిటైజర్లలో ప్రమాదకర మెథనాల్ వాడుతున్నారని, చాలా చోట్ల నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయని తెలిపింది. శానిటైజర్ల తయారీపైనా దృష్టి పెట్టాలని సీబీఐ రాష్ట్రాలకు సూచించింది.


More Telugu News