తమిళనాడులో కరోనా బీభత్సం... 4 జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్
- తమిళనాడులో 435 మంది మృతి
- నిన్న ఒక్కరోజే 1,974 కొత్త కేసులు
- 12 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్
తమిళనాడులో కరోనా రక్కసి కోరలు చాచి విజృంభిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 44,661 కరోనా కేసులు నమోదు కాగా, 435 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే తమిళనాడు వ్యాప్తంగా 1,974 కొత్త కేసులు నమోదవడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. ఈ నేపథ్యంలో తమిళనాడు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో 12 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.
కేవలం అత్యవసర సర్వీసులను మినహాయించి, ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. జూన్ 19 నుంచి 30 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇక రెండు ఆదివారాలు (జూన్ 21, 28) ఎలాంటి సడలింపులు లేకుండా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఆ సమయంలో పాలు, ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు, ఇతర వైద్య సేవలను మాత్రమే అనుమతిస్తారు.