తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- మహారాష్ట్ర వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
- తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఏపీలో ఓ మోస్తరు వర్షాలు
నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర వరకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అరేబియా సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.