ఒకప్పుడు నేనూ చనిపోవాలనుకున్నాను... అయితే ఆ ఆశే బతికించింది!: ఖుష్బూ
- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణంపై ఖుష్బూ స్పందన
- ఓ దశలో తాను జీవితంపై ఆశ కోల్పోయానని వెల్లడి
- స్నేహితులు జీవనరేఖలా మారారని వివరణ
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతం సినీ ప్రముఖులను కలచివేసింది. దీనిపై ప్రముఖ నటి ఖుష్బూ స్పందించారు. తన జీవితంలోనూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిన క్షణాలు ఉన్నాయని వెల్లడించారు.
ఓ దశలో జీవితంపై ఎలాంటి ఆశ లేని పరిస్థితి ఏర్పడిందని, ఓ సొరంగం చివరన అంధకారంలో నిల్చున్న భావన కలిగిందని వివరించారు. అయితే, బతకాలన్న మొండిపట్టుదల, స్నేహితులు తన జీవితంలో వెలుగు రేఖల్లా మారారని, ఒక్క అవకాశం తన జీవితాన్ని మార్చివేస్తుందన్న ఆశను పెంపొందించుకున్నానని, ఆ దృక్పథం ఫలితమే ఇప్పుడిలా ఉన్నానని తెలిపారు.
ఆ దశలో చావే అన్ని సమస్యలకు పరిష్కారం అని భావించానని పేర్కొన్నారు. అయితే, మానసికంగా వేధించే అంశాల గురించి ఆలోచిస్తూ కుంగిపోవడం ద్వారా విలువైన జీవితాన్ని వదులుకోవడం ఎందుకని తనను ప్రశ్నించుకున్నానని, తనలోని ధైర్యమే తనకు తోడుగా నిలిచిందని చెప్పారు. సమస్యలు లేకుండా ఎవరూ ఉండరని, సమస్యలతో పోరాడాలన్న కసి ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని వివరించారు.