ఆసుపత్రి అత్యవసర వార్డులోకి వాన నీటి వరద.. వీడియో ఇదిగో
- మహారాష్ట్రలో ఘటన
- అత్యవసర వార్డులో 8 మంది రోగులు
- వేరే వార్డుకి తరలింపు
- తీవ్ర విమర్శలు
దేశంలో వైద్య సదుపాయాలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో తెలిపే విషయానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి వాన నీటి వరద వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. జలగావ్‌లోని డాక్టర్ ఉల్హస్ పటేల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోకి వరదనీరు వచ్చింది.
ఆ సమయంలో ఇదే వార్డులో ఎనిమిది మంది రోగులు అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు. వారందరినీ సురక్షితంగా వేరే వార్డుకి పంపినట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. అత్యవసర వార్డులోకి ఇలా వరద నీరు రావడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.