తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సకు చార్జీలు నిర్ణయించిన ప్రభుత్వం

  • తాజాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతి
  • కరోనా పరీక్ష ధర రూ.2,200
  • ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500
  • వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9,000  
తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వాటి ధరలను నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200 అని, వెంటిలేటర్‌ అవసరం లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500 తీసుకోవాలని, ఒకవేళ రోగి వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9,000 తీసుకోవాలని చెప్పారు.

అయితే, కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని తాము మార్గదర్శకాలు ఇస్తున్నామని ప్రకటించారు. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు, పరిస్థితులను తెలుసుకునేందుకు తాను ఉన్నతస్థాయి  సమీక్షలు ప్రతి రోజు నిర్వహిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు.


More Telugu News