ద్వారకా తిరుమలరావు స్థానంలో విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు!
- రిలీవ్ అయిన ద్వారకా తిరుమలరావు
- శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
- మీడియాతో బత్తిన శ్రీనివాసులు
విజయవాడ పోలీసు కమిషనర్ గా బత్తిన శ్రీనివాసులు ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో ద్వారకా తిరుమలరావు రిలీవ్ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు నగరం గురించి మంచి అవగాహన ఉందని అన్నారు. తనకు సీపీగా పనిచేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తానని, స్పెషల్ బ్రాంచ్ ని బలోపేతం చేయడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేస్తామని శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమ రవాణాలను సహించేది లేదని హెచ్చరించారు. ఆన్ లైన్ మోసాల పైనా ప్రత్యేక దృష్టిని సారిస్తామని అన్నారు. కాగా, శ్రీనివాసులు 2013 మే నుంచి ఏడాదికి పైగా విజయవాడ సీపీగా పని చేశారు.