కరోనా సోకితే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన వస్తువులివే... కోలుకున్న యువతి సలహా ఇది!

  • మొబైల్ ఫోన్, చార్జర్ తీసుకెళ్లండి
  • కొన్ని దుస్తులు, బ్రష్, టూత్ పేస్ట్, సోప్ మస్ట్
  • టైమ్ పాస్ కోసం పుస్తకాలు తీసుకెళ్లాలని సూచన
కరోనా వైరస్ సోకి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితే ఏర్పడితే, ఏ మాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఓ యువతి. దాదాపు రెండు వారాలు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఏఏ వస్తువులు తీసుకెళ్లాలన్న విషయమై ఆమె సలహాలు ఇస్తోంది. కొవిడ్-19 సోకి, నోయిడాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది రికవరీ అయిన ఆమె, ఆసుపత్రిలో ఏఏ వస్తువులు అవసరమవుతాయి? ఏం తీసుకెళ్లాలన్న విషయమై సూచనలు చెప్పింది.

క్వారంటైన్ లేదా, ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి అయిన వేళ, మొబైల్ ఫోన్, పవర్ బ్యాంక్, చార్జర్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచించిందామె. హాస్పిటల్ లో కాస్తంత వేడిగా ఉండే నీటిని ఇస్తుంటారు కాబట్టి, ప్లాస్టిక్ బాటిల్ బదులు, ఓ స్టీలు బాటిల్, గ్లాస్ ను వెంట తీసుకుని వెళ్లాలని, హాస్పిటల్ లో టిఫిన్, లంచ్, డిన్నర్ ఇస్తారని, మధ్యలో ఆకలైతే తినేందుకు, అందునా విటమిన్ సీ అధికంగా ఉండే పండ్లను కూడా వెంట తీసుకుని వెళ్లాలని సూచించింది.

టాయిలెట్లలో వినియోగించుకునేందుకు సొంతంగా టవల్, సోప్, షాంపు, టూత్ పేస్టు, బ్రష్ తీసుకెళ్లడం తప్పనిసరని, పరిస్థితి విషమంగా లేకుంటే, ఏ దుస్తులైనా ధరించవచ్చు కాబట్టి, తగిన దుస్తులను కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్లాలని, ఇతరత్రా రుగ్మతలు ఉంటే అందుకు సంబంధించిన మందులను వెంట తీసుకెళ్లాలని తెలిపింది. 14 రోజులు ఉండాలి కాబట్టి, టైమ్ పాస్ నిమిత్తం చదువుకునేందుకు పుస్తకాలు, డ్రాయింగ్ వంటి యాక్టివిటీ బుక్స్, దైవ ప్రార్థన నిమిత్తం దేవుళ్ల ఫొటోలను తీసుకుని వెళితే ముందు చూపుతో ఉన్నట్టని చెప్పుకొచ్చింది.


More Telugu News