బాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు: విజయసాయిరెడ్డి
- అచ్చెన్న అరెస్టును బీసీల అణచివేత అంటున్నారు
- 2002లో బాలయోగి గారి దుర్మరణం
- లోక్సభ స్పీకర్ పదవికి ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు
- ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు విజనరీ
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ విషయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
'అచ్చెన్న అరెస్టును బీసీల అణచివేతగా రంగు పులుముతున్న బాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు విజనరీ' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.