తెరచుకున్న యాదాద్రి... నిబంధనలను మరచిన భక్తులు!

  • ఆదివారం పెరిగిన భక్తుల రద్దీ
  • అధికారుల మొర వినని భక్తులు
  • లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెరచుకోగా, భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కొండపై రద్దీ పెరిగింది.

 నిన్న స్వామిని సుమారు 6 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వచ్చిన భక్తులు లాక్ డౌన్ నిబంధనలను పాటించ లేదు. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహించారు. ఆలయ పరిసరాలు, ప్రసాదాల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా కనిపించారు. ఆలయం వద్ద మైకుల్లో భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకున్న వారే కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది.


More Telugu News