ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను దేవతగా కొలుస్తున్న వ్యక్తి!
- కరోనా మాతకు పూజలు చేస్తున్న కేరళ వ్యక్తి
- కరోనాతో పోరాడుతున్న వారిని చల్లగా చూడాలని ప్రార్థనలు
- విరుచుకుపడుతున్న నెటిజన్లు
ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్ దేవతగా మారిపోయింది. కరోనా వైరస్‌ను దేవతగా కొలుస్తున్న కేరళలోని కడక్కల్‌కు చెందిన వ్యక్తి.. వైరస్ బారినపడి పోరాడుతున్న వారిని రక్షించాలంటూ ప్రతి రోజూ పూజలు చేస్తున్నాడు. వైరస్‌ను కరోనా మాతగా మార్చిన ఆ వ్యక్తి పేరు అనిలన్. కరోనా నిర్మూలనకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు సహా ప్రతి ఒక్కరినీ కాపాడాలంటూ ‘వైరస్ మాత’ను ప్రార్థిస్తున్నాడు.
మరోపక్క, అనిలన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే అనిలన్ ఇలా చేస్తున్నాడని మండిపడుతున్నారు. జనాన్ని కాటేస్తున్న వైరస్‌కే ప్రజలను రక్షించాలంటూ పూజలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, విమర్శలకు తాను వెరవబోనని, తాను చేస్తున్నది సరైనదేనని అనిలన్ స్పష్టం చేశాడు. వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను ఎంచుకున్న మార్గం ఇదని పేర్కొన్నాడు.