దేశంలో 9 వేలు దాటిన మరణాలు.. ప్రపంచంలో తొమ్మిదో స్థానానికి భారత్!
- ప్రతి రోజు వేలల్లో నమోదవుతున్న కేసులు
- ఇప్పటి వరకు 9,195 మంది బలి
- కేసుల్లో నాలుగో స్థానం
దేశంలో కరోనా మహమ్మారి గతంలో ఎన్నడూ లేనంతగా చెలరేగిపోతోంది. ప్రతి రోజు 10 వేలకు మించి కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు, మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
ఇప్పటి వరకు 9,195 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఫలితంగా మరణాల జాబితాలో భారతదేశం ప్రపంచ జాబితాలో 9వ స్థానానికి చేరుకున్నట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఇక, కేసుల విషయానికి వస్తే నాలుగో స్థానంలో ఉంది. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 325 మంది మరణించారు.