ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అద్దెబస్సుల డ్రైవర్లను కూడా ఆదుకోవాలి: పవన్ కల్యాణ్

  • లాక్ డౌన్ తో అద్దె డ్రైవర్లు కష్టాలపాలయ్యారన్న పవన్
  • మార్చి నుంచి జీతాలు రావడంలేదని వెల్లడి
  • ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని విజ్ఞప్తి
లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ అద్దెబస్సుల డ్రైవర్లు కష్టాలపాలయ్యారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అద్దెబస్సులకు పనిచేస్తున్న డ్రైవర్ల కష్టాన్ని కూడా గుర్తించాలని సూచించారు.

ఈ డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్లు కారని, వీరి బాధ్యత అద్దె బస్సుల యజమానులదేనని ప్రభుత్వం, ఆర్టీసీ భావించడం సరికాదని హితవు పలికారు. సుమారు 8 వేల మంది అద్దెబస్సుల డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, లాక్ డౌన్ కారణంగా మార్చి నుంచి తమకు జీతాలు రావడంలేదని డ్రైవర్లు జనసేన దృష్టికి తీసుకువచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వీరిని ఆదుకోవాలని కోరారు.


More Telugu News