ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం

  • మొదట పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులు
  • ఆపై దశల వారీగా సర్వీసుల సంఖ్య పెంపు
  • బెంగళూరు సహా ముఖ్య పట్టణాలకు బస్సులు
లాక్ డౌన్ సడలింపులతో ఏపీలో బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఇంకా అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లభించకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు బస్సులు వెళ్లడంలేదు. ఈ క్రమంలో ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మొదట పరిమిత సంఖ్యలోనే బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు 168 బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆపై 4 దశల్లో బస్సు సర్వీసుల సంఖ్యను 500కి పెంచాలని ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు రేపటి నుంచి ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు. బస్సుల్లో భౌతికదూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం తప్పనిసరి చేయనున్నారు. అట్నుంచి రాష్ట్రానికి వచ్చేవారిలో 5 శాతం మందికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.


More Telugu News