నవంబరు నాటికి భారత్ లో కరోనా పతాకస్థాయికి చేరుతుంది: ఐసీఎంఆర్

  • లాక్ డౌన్ కారణంగా పీక్ స్టేజ్ ఆలస్యమైందని వెల్లడి
  • లేకపోతే ఈ పాటికి పీక్ స్టేజ్!
  • ఐసీయూ బెడ్లకు కొరత ఏర్పడుతుందన్న ఐసీఎంఆర్
దేశంలో కరోనా వ్యాప్తిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికర అంశాలు వెల్లడించింది. భారత్ లో 8 వారాల పాటు కొనసాగిన లాక్ డౌన్ కారణంగా కరోనా పతాకస్థాయి ఆలస్యం అయిందని తెలిపింది. దేశంలో లాక్ డౌన్ విధించకపోయుంటే ఈపాటికి కరోనా పీక్ స్టేజ్ లో ఉండేదని పేర్కొంది.

కరోనా కేసుల సంఖ్య పీక్స్ కు వెళ్లే సమయం  లాక్ డౌన్ కారణంగా 34 నుంచి 76 రోజుల ఆలస్యం అయిందని వివరించింది. తద్వారా నవంబరు నాటికి భారత్ లో కరోనా విశ్వరూపం చూడొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఆ సమయానికి ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లకు విపరీతమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


More Telugu News