బెజవాడ రౌడీషీటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

  • ఇటీవల విజయవాడలో గ్యాంగ్ వార్
  • ఓ యువకుడి మృతి
  • 41 మంది రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
విజయవాడలో ఇటీవల జరిగిన గ్యాంగ్ వార్ పోలీసు వర్గాలను అప్రమత్తం చేసింది. ఓ దొమ్మీ తరహాలో నగరం నడిబొడ్డున జరిగిన ఈ దాడి అనంతరం పోలీసులు రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. సిటీలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. తాజాగా 41 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

కమిషనరేట్ పరిధిలో 470 మంది రౌడీషీటర్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు... శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠినచర్యలు తప్పవని, ఎవరినీ ఉపేక్షించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలోని తోటవారి వీధిలో జరిగిన గ్యాంగ్ వార్ లో సందీప్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్ మెంట్ వివాదం ఈ ఘటనకు కారణమైంది.


More Telugu News