కోలుకుంటున్న అచ్చెన్నాయుడు.. ఆసుపత్రిలోని రెండో అంతస్తులోని గదికి తరలింపు
- ఇటీవల జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిన వైనం
- గాయానికి జీజీహెచ్‌లో వైద్యులు చికిత్స
- జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అచ్చెన్నాయుడు
- ఆయనను కలిసేందుకు ఎవరికీ అనుమతిలేదు
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం ఆయన అధికారులతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆయనకు ఇటీవల జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ వైద్యులు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన గాయానికి జీజీహెచ్‌లో వైద్యులు చికిత్స అందించారు.
ఆపరేషన్ గాయం నుంచి ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. దీంతో ఆయనను ఎమర్జెన్సీ వార్డు నుంచి జీజీహెచ్ ఆసుపత్రిలోని రెండో అంతస్తులోని ఓ గదికి తరలించారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ఎవరినీ అనుమతించట్లేదు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఆయనను పరామర్శించేందుకు అనుమతి లభించని విషయం తెలిసిందే.