'హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా' అంటే ఏంటీ?.. నెటిజన్లలో ఆసక్తి రేపిన పదం!

  • ఈ పదాన్ని వాడుతూ శశిథరూర్ ట్వీట్ 
  • అర్థం తెలుసుకోవడానికి డిక్షనరీలు తెగవెతికిన నెటిజన్లు 
  • చివరకు 'పెద్ద ప‌దాల‌ను ప‌ల‌క‌డానికి భ‌య‌ప‌డ‌టం' అని గుర్తింపు
'హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా' అంటే ఏంటీ? అనే ఆసక్తి నెటిజన్లలో ఆసక్తి రేపింది. దీని కోసం ఎన్నో డిక్షనరీలు తిరగేశారు. గూగుల్‌లో చాలా మంది సెర్చ్‌ చేశారు. చివరకు దీని అర్థం 'పెద్ద ప‌దాల‌ను ప‌ల‌క‌డానికి భ‌య‌ప‌డ‌టం' అని నెటిజన్లు గుర్తించారు. ఇంతగా ఆసక్తిరేపిన ఈ పదాన్ని కాంగ్రెస్ ఎంపీ, ర‌చ‌యిత‌ శ‌శిథ‌రూర్ సామాజిక మాధ్యమాల్లో వినియోగించారు.

ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆ పదానికి అర్థం తెలుసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు క‌మెడియ‌న్ సలోనీ గౌర్ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ వెబ్‌సిరీస్‌ కోసం నటి సుస్మితా సేన్‌ శ‌శిథరూర్ గొంతును అనుక‌రిస్తూ మాట్లాడింది. ఆ వెబ్‌సిరీస్‌లోని చంద్ర‌చూర్ సింగ్‌ పాత్రకు శ‌శిథ‌రూర్‌కు మ‌ధ్య పోలిక ఉన్న‌ట్లు చెప్పింది.

ఈ వీడియోను ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా శశిథరూర్‌కి ట్వీట్ చేశారు. దీనిపై శశిథరూర్‌ స్పందిస్తూ  తెర‌పై క‌నిపించే న‌టుడికి మాత్రం క‌చ్చితంగా హిప్పొపొటోమ‌న్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా ఉండ‌దని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పదానికి అర్థం కోసం నెటిజన్లు తెగవెతికారు.


More Telugu News