కరోనాకు వ్యాక్సిన్ తయారీలో రెండో దశ పరీక్షలోనూ చైనా విజయం ‌

  • చైనా బయోఫార్మా సంస్థ సినోవాక్‌ బయోటెక్‌ ప్రకటన
  • చాలా సురక్షితమైన వ్యాక్సిన్‌
  • 2 వారాల్లో వ్యక్తుల్లో యాంటీ బాడీల ఉత్పత్తి 
  • మూడో దశ పరీక్షలను బ్రెజిల్‌లో చేపట్టనున్న చైనా
కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే విషయంలో చైనా బయోఫార్మా సంస్థ సినోవాక్‌ బయోటెక్‌ దూకుడుగా ముందుకు వెళ్తోంది. కరోనావ్యాక్‌ పేరిట అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇటీవల జరిపిన‌ పరీక్షలో విజయవంతమైందని ఆ సంస్థ తెలిపింది. తాము అభివృద్ధి చేస్తోన్న ఈ వ్యాక్సిన్‌ చాలా సురక్షితమైనదని తెలిపింది.

దీనికి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడంలో మెరుగైన సామర్థ్యం ఉందని తాము గుర్తించినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు రెండు దశల్లో పరీక్షలు నిర్వహించారు. దీనికి మూడో దశ పరీక్షలను తాము బ్రెజిల్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది.

ఇప్పటివరకు రెండు దశల్లో తాము ఈ వ్యాక్సిన్‌ ను పలువురిలో ప్రవేశపెట్టి ప్రయోగాలు చేయగా వారిలో 90 శాతం మందికి పైగా ఎటువంటి తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదని చెప్పింది. వారిలో ఈ వ్యాక్సిన్‌ 2 వారాల్లో యాంటీ బాడీలను విజయవంతంగా ఉత్పత్తి చేసిందని తెలిపింది.



More Telugu News