పాక్ దుందుడుకు చర్యలు... కాల్పుల్లో భారత సైనికుడు మృతి
- పూంచ్ జిల్లాలో ఘటన
- మరో ఇద్దరికి గాయాలు
- వరుసగా ఆరు రోజులుగా కాల్పులు
సరిహద్దుల్లో పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ రోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మరోసారి కాల్పులకు తెగబడింది. షాపూర్, కిర్ణి సెక్టార్ల పరిధిలోని ఎల్ఓసి వద్ద పాక్ రేంజర్లు జరిపిన దాడిలో ఓ భారత సైనికుడు మృతి చెందాడు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 6 రోజులుగా పూంచ్ సెక్టార్‌లో పాక్ ఇటువంటి ఘటనలకు పాల్పడుతూనే ఉంది.
ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు పాక్ మొత్తం 114 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు తూట్లు పొడిచిందని అధికారులు తెలిపారు. అలాగే, 6 నెలల్లో 2,000కు పైగా ఇటువంటి ఘటనలకు పాల్పడిందని వివరించారు. పాక్ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.