కరోనా డ్రగ్ తయారీ నిమిత్తం రంగంలోకి దిగిన డాక్టర్ రెడ్డీస్!

  • హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్
  • గిలీడ్ సైన్సెస్ తో డీల్
  • భారీ ఎత్తున రెమిడెసివిర్ ను తయారు చేయనున్న రెడ్డీస్
కరోనా చికిత్సలో వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతున్న రెమిడెసివిర్ ను తయారు చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రంగంలోకి దిగింది. ఈ మెడిసిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు గిలీడ్ సైన్సెస్ తో డీల్ కుదుర్చుకున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఒప్పందం ప్రకారం, ఇండియాలో రెమిడెసివిర్ తయారీ, అమ్మకాలకు సంబంధించిన హక్కులను తాము సొంతం చేసుకున్నామని సంస్థ తెలిపింది. ఔషధం తయారీకి కావాల్సిన టెక్నాలజీని గిలీడ్ సైన్సెస్ అందించనుందని తెలిపింది. ఇదిలావుండగా, రెమిడెసివిర్ తయారీకి ఇప్పటికే హెటిరో ఫార్మా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ వంటి కంపెనీలు గిలీడ్ సైన్సెస్ తో డీల్స్ కుదుర్చుకున్నాయన్న సంగతి తెలిసిందే. వీటికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి వుంది. డ్రగ్ కంట్రోల్ జనరల్ నుంచి అనుమతి రాగానే ఈ కంపెనీలన్నీ రెమిడెసివిర్ ను తయారు చేసి మార్కెటింగ్ చేయనున్నాయి.


More Telugu News