విజయవాడ గ్యాంగ్ వార్: ప్రధాన నిందితుడు పండు అరెస్ట్... ఆయుధాలు స్వాధీనం

  • విజయవాడలో గ్యాంగ్ వార్ తో ఓ యువకుడి మృతి
  • ఇప్పటివరకు 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • అరెస్టయిన పండును కోర్టులో హాజరు పర్చిన పోలీసులు
  • కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైలుకు తరలింపు
ఇటీవల విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగరంలోని తోట వారి వీధిలో జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో సందీప్ అనే యువకుడు మరణించగా, అతడి ప్రత్యర్థి పండు అలియాస్ మణికంఠ గాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. ఇప్పుడు పండు కోలుకోవడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు కత్తులు, ఒక ఫోల్డింగ్ బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ రోజు పండును కోర్టులో హాజరుపర్చారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 33 మందిని అరెస్ట్ చేశారు. వారిలో సందీప్, పండు గ్యాంగులకు చెందిన సభ్యులున్నారు. మరో 15 మంది పరారీలో ఉండగా, వారి కోసం 6 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నాయి.


More Telugu News