కాలువను శుభ్రం చేస్తుంటే.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. వీడియో ఇదిగో!

  • కోల్ కతాకు 120 కిలోమీటర్ల దూరంలో ఘటన
  • కొన్ని రోజులుగా కాలువను శుభ్రం చేస్తున్న అధికారులు
  • పునాదులు కూడా బలహీనంగా ఉన్నాయన్న అధికారులు
నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన పశ్చిమబెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. కోల్ కతాకు 120 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనానికి ఆనుకుని ఉన్న కెనాల్ ను శుభ్రం చేయడంతో భవనం కూలిపోయింది. కొన్ని రోజులుగా కెనాల్ ను శుభ్రం చేసే పనిని అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితమే బిల్డింగ్ కి పగుళ్లు ఏర్పడటం ప్రారంభమైంది.

మరోవైపు, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. బిల్డింగ్ పునాదులు కూడా బలహీనంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ భూమిని  ఆక్రమించి, కెనాల్ లోపలి వరకు భవన నిర్మాణాన్ని చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  


More Telugu News