సినిమాలకు దూరంగా ఉండటానికి కారణమిదే: మంచు లక్ష్మి

  • మంచి పాత్రలు దొరకడం లేదు
  • లాక్ డౌన్ మధురానుభూతులను మిగిల్చింది
  • నాన్నకు మెడిటేషన్ నేర్పించాను
మీటూ ఉద్యమం తర్వాత చాలా మందిలో భయాలు మొదలయ్యాయని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. అయితే, వేధింపులపై గళం విప్పిన చాలా మంది మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, స్వప్న దత్, సుప్రియ, నందిని, ఝాన్సీ ఐదుగురం కలిసి ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై పోరాడుతున్నామని చెప్పారు.

'వైఫ్ ఆఫ్ రామ్' చిత్రం తర్వాత మంచి పాత్రలు దొరకలేదని... అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నానని లక్ష్మి తెలిపారు. తన ఇమేజ్ కి తగినటువంటి మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. లాక్ డౌన్ తనకు మధురానుభూతులను మిగిల్చిందని చెప్పారు.

అమ్మానాన్నలు, విష్ణుతో కలిసి చాలా కాలం తర్వాత ఎక్కువ రోజులు గడిపే అవకాశం లభించిందని తెలిపారు. నాన్నకు నచ్చిన వంటలు చేస్తూ సరదాగా గడిపామని చెప్పారు. అందరికీ నచ్చిన సినిమాలు చూశామని తెలిపారు. నాన్నకు మెడిటేషన్ నేర్పించానని అన్నారు. 'లాక్డ్ అప్ విత్ లక్ష్మి' పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ రంగాల్లోని ప్రముఖులతో ముచ్చటించానని చెప్పారు.


More Telugu News