అచ్చెన్న అరెస్ట్ తర్వాత ట్విట్టర్ ప్రొఫైల్ మార్చేసిన చంద్రబాబు

అచ్చెన్న అరెస్ట్ తర్వాత ట్విట్టర్ ప్రొఫైల్ మార్చేసిన చంద్రబాబు
  • అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ
  • వుయ్ స్టాండ్ విత్ యూ అంటూ అచ్చెన్నకు టీడీపీ సంఘీభావం
  • ట్విట్టర్ ప్రొఫైల్ ను అచ్చెన్న ఫొటోతో అప్ డేట్ చేసిన చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేయడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. చంద్రబాబు నుంచి ఇతర నేతల వరకు ఈ అరెస్ట్ ను ముక్తకంఠంతో ఖండించడమే కాదు, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

 ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లోనూ చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ వెంట నడిచిన అచ్చెన్నాయుడికి తాము బాసటగా ఉంటామంటూ ట్విట్టర్ లో ఇప్పటికే వుయ్ స్టాండ్ విత్ యూ అచ్చెన్నాయుడు అనే హ్యాష్ ట్యాగ్ ను టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ట్విట్టర్ ప్రొఫైల్ ను అచ్చెన్నాయుడు ముఖచిత్రంతో మార్చేశారు. వుయ్ స్టాండ్ విత్ యూ అంటూ సంఘీభావం ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా చంద్రబాబు బాటలోనే ప్రొఫైల్ లో అచ్చెన్నాయుడు ఫొటో అప్ డేట్ చేశారు.


More Telugu News