పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్
- గురువారం నుంచి అనారోగ్యం
- ఒళ్లంతా నొప్పులతో బాధపడిన అఫ్రిదీ
- అభిమానుల ఆశీస్సులు, అల్లా దయ కోరుకుంటూ ట్వీట్
పాకిస్థాన్ క్రికెట్లో డాషింగ్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుని, ఆటకు వీడ్కోలు పలికాక భారత్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న షాహిద్ అఫ్రిదీ కరోనా బారినపడ్డాడు. అఫ్రిదీకి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు.
"గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఒళ్లంతా ఒకటే నొప్పులు. వైద్య పరీక్షలు చేస్తే దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ అని వచ్చింది. త్వరగా కోలుకునేందుకు అల్లా దయ, మీ ఆశీస్సులు కావాలని కోరుతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.