కోహ్లీని అవుట్ చేస్తే జట్టు మొత్తాన్ని అవుట్ చేసినట్టే: సక్లాయిన్ ముస్తాక్

  • కోహ్లీ ఒక్కడే 11 మందితో సమానం అన్న పాక్ దిగ్గజం
  • ప్లానింగ్ లేకపోతే కోహ్లీని అవుట్ చేయలేరని వెల్లడి
  • కోహ్లీపై అపారమైన ఒత్తిడి ఉంటుందని వివరణ
పాకిస్థాన్ స్పిన్ దిగ్గజం సక్లాయిన్ ముస్తాక్ టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఒక్కడే 11 మందితో సమానం అని, కోహ్లీ వికెట్ తీస్తే టీమిండియా మొత్తాన్ని అవుట్ చేసినట్టని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేకుండా అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టమని సక్లాయిన్ స్పష్టం చేశాడు.

"కోహ్లీ వరల్డ్ క్లాస్ ఆటగాడన్న విషయం బౌలర్ కు తెలిసుండాలి. అంతేకాదు, అతను ఎలాంటి బౌలర్ నైనా ఎదుర్కోగలడన్న సంగతి గుర్తెరగాలి. అయితే, కోహ్లీ ఆడుతుంటే యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి అతడిపైనే ఉంటుంది. అందువల్ల అతడిపై అపారమైన ఒత్తిడి ఉంటుంది. ఈ అంశాన్ని కూడా బౌలర్ గుర్తించి బంతులు వేయాలి. కచ్చితమైన ప్లాన్, పట్టుదల లేకపోతే మాత్రం కోహ్లీకి ఎలాంటి బంతులు వేసినా ఉపయోగం ఉండదు" అని ఓ లైవ్ చాట్ లో వివరించాడు.


More Telugu News