జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై జేసీ పవన్, దీపక్‌రెడ్డిలతో మాట్లాడిన చంద్రబాబు
- జేసీ ప్రభాకర్‌పై 24 కేసులు పెట్టారన్న జేసీ పవన్
- ఒకటి మినహా అన్నింటిలో బెయిల్ వచ్చిందని వ్యాఖ్య
- ఆ ఒక్క కేసులోనూ త్వరలోనే బెయిల్ వస్తుందనే అరెస్టు
- అండగా ఉంటామన్న చంద్రబాబు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ పవన్, దీపక్‌రెడ్డిలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, అరెస్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు.
కాగా జేసీ ప్రభాకర్‌పై 24 కేసులు పెట్టారని జేసీ పవన్ వివరించారు. వాటిల్లో ఒకటి మినహా అన్నింటిలో బెయిల్ వచ్చిందని, ఈ ఒక్క కేసులోనూ త్వరలోనే బెయిల్ వస్తుందనే ఈ రోజు వారిద్దరినీ అక్రమ అరెస్టు చేశారన్నారు.
ఏ కేసులోనూ, ఎఫ్‌ఐఆర్‌లోనూ ప్రభాకర్‌రెడ్డి పేరు లేదని, బెదిరించి ఎవరితోనో తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రభాకర్‌రెడ్డిని అరెస్టు చేశారని తెలిపారు. మరోవైపు, అస్మిత్‌పై ఎలాంటి కేసు లేదని పవన్ తెలిపారు. అరెస్టు చేయడానికి ముందే తప్పుడు కేసులు పెట్టారని ఆయన చెప్పారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తెలిపారు.