తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోన్న పోలీసులు

  • గోదావరి పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపు
  • ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్తుండగా అరెస్టులు
  • పలువురి గృహనిర్బంధం
తెలంగాణలోని గోదావరి పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా దుమ్మగూడెం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అడ్డుకుని వెనక్కి వెళ్లాలని సూచించారు.

వైరాలో భట్టి విక్రమార్కను అడ్డుకోవడంతో పాటు కొత్తగూడెంలో కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ను అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను, భద్రాచలంలో ఎమ్మెల్యే వీరయ్యను గృహనిర్బంధం చేశారు.  


More Telugu News