చిన్నారి డ్యాన్స్ కు ముగ్ధుడైన హృతిక్ రోషన్!
- పాప డ్యాన్స్ వీడియోను రీట్వీట్ చేసిన హీరో
- 'వార్'లోని 'జై బోలో శివ్‌శంకర్' పాటకు డాన్స్
- 'వాట్ ఏ స్టార్... లవ్' అని ప్రశంస
డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఒక పాప చేసిన డ్యాన్స్‌కు ఆశ్చర్యపోయాడు. ఆయన నటించిన 'వార్' సినిమాలోని 'జై బోలో శివ్‌శంకర్' పాటకు గీత్ అనే బాలిక డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన హృతిక్ రోషన్ దాన్ని రీట్వీట్ చేస్తూ ఆమెను ప్రశంసించాడు.
'వాట్ ఏ స్టార్... లవ్' అని ఆయన పేర్కొన్నాడు. హృతిక్ రోషన్ ను అనుకరిస్తూ ఆ బాలిక డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఇంత చిన్న వయసులో ఇంత ఎనర్జీతో ఆమె చేసిన డ్యాన్స్ పట్ల నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.