కరోనా మహమ్మారిని పోలియో వ్యాక్సిన్ అడ్డుకుంటుందా?: మొదలైన పరిశోధనలు

  • క్షయ, పోలియో టీకాలపై పరిశోధన
  • వీటి వల్ల ముప్పు తక్కువ, ఫలితం ఎక్కువ అంటున్న పరిశోధకులు
  • సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయంటున్న నిపుణులు
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతుండగా, అమెరికా పరిశోధకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలపైనే పరిశోధనలు నిర్వహిస్తున్నారు. క్షయ, పోలియో వ్యాక్సిన్లు కరోనా వైరస్‌పై ఏ మేరకు ప్రభావం చూపగలవన్న దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు.

ఈ మేరకు ‘వాషింగ్టన్ పోస్ట్’ ఓ కథనంలో పేర్కొంది. కాగా, కరోనా వైరస్‌పై పోరాడేందుకు బాసిల్లస్ కాల్మెట్టే గ్యురిన్ (బీసీజీ) టీకా చక్కగా పనిచేస్తుందని టెక్సాస్ ఏ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో పేర్కొన్నారు. గతంలో ఈ టీకాను సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు ఉన్నట్టు చెప్పారు.

మరోవైపు, కరోనాపై పోరుకు పోలియో టీకాను ఉపయోగించొచ్చని మరికొందరు చెబుతున్నారు. బీసీజీ, పోలియో టీకాల వల్ల బాధితులకు ముప్పు తక్కువని, ఇప్పటికే వీటిని  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇచ్చారని పాక్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ అజ్రా రజా పేర్కొన్నారు. ఈ టీకాల వల్ల శరీరంలో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఫలితంగా వైరస్‌లను నియంత్రించగలని రజా వివరించారు.


More Telugu News