తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్
- నకిలీ పత్రాలతో 154 లారీలను రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు
- హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్న పోలీసులు
- బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా చూపించారన్న అభియోగాలు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు శివారు శంషాబాద్‌లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు.