కరోనా టెస్టులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • కరోనా టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతించిన ప్రభుత్వం
  • ఒక్కో టెస్టుకు రూ. 2,900 మాత్రమే వసూలు చేయాలని షరతు
ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా అనుమతించింది. అయితే, టెస్టులు నిర్వహించే ల్యాబ్ లకు ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్ గుర్తింపు ఉండాలని షరతు విధించింది. ఒక్కో పరీక్షకు రూ. 2,900 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో... ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం టెస్టులకు సంబంధించి తాజా నిర్ణయం తీసుకుంది.


More Telugu News