ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపైనా దర్యాప్తు జరిపించాలి: జనసేన డిమాండ్
- అవినీతికి పాల్పడినందుకు అరెస్ట్ చేశారా?
- లేక కక్ష సాధింపుకు పాల్పడ్డారా?
- ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే రాజ్యాంగ నిబంధనలను పాటించాలి
అవినీతి ఆరోపణలతో టీడీపీ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడంపై జనసేన పార్టీ అనుమానాలను వ్యక్తం చేసింది. అవినీతికి పాల్పడినందుకు అరెస్ట్ చేశారా? లేక కక్ష సాధింపుకు పాల్పడ్డారా? అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.
అవినీతిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మనోహర్ అన్నారు. ఇక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అయితే అచ్చెన్న విషయంలో వీటిని పాటించలేదనిపిస్తోందని విమర్శించారు. ఈఎస్ఐలో జరిగిన అవకతవకలతో పాటు, ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోందని చెప్పారు.