తెలంగాణకు, ఏపీకి తేడా ఇదే: సోమిరెడ్డి
- అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నను అరెస్ట్ చేశారు
- తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణంపై విచారణ జరిపి అధికారులను అరెస్ట్ చేశారు
- ఏపీలో విచారణ లేకుండానే అచ్చెన్నను అరెస్ట్ చేశారు
టీడీపీ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీకి చెందిన మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయనను అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కుట్రేనని చెప్పారు. టీడీఎల్పీ ఉపనేతగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఆయన ఎండగడుతున్నారని... అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వచ్చాయని.... దీంతో, కుంభకోణంపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారని సోమిరెడ్డి చెప్పారు. ఏపీలో మాత్రం ఎలాంటి శాఖాపరమైన విచారణ లేకుండానే, అచ్చెన్నను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్రేనని అన్నారు. అచ్చెన్నను అరెస్ట్ చేయడం బలహీనవర్గాలను వేధించడమేనని చెప్పారు.