భారత దేశం మొత్తం ఈ యువకుడిని చూసి గర్వపడుతోంది!: డేవిడ్‌ వార్నర్‌

  • కర్ణాటకకు చెందిన విద్యార్థి శ్రేయస్‌
  • అస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ వర్సిటీలో చదువు
  • కరోనా వేళ సేవలు
  • శ్రేయస్‌కు వార్నర్ థ్యాంక్స్
భారత దేశం మొత్తం ఓ విద్యార్థిని చూసి గర్విస్తోందంటూ ఆస్ట్రేలియాలో చదువుతున్న ఓ భారతీయ స్టూడెంట్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌  ప్రశంసల జల్లు కురిపించాడు. కర్ణాటకకు చెందిన శ్రేయస్‌ అనే విద్యార్థి క్వీన్స్‌ల్యాండ్‌ వర్సిటీలో  చదువుతున్నాడు. ఓ సామాజిక సేవ బృందంలో చేరిన ఆ కుర్రాడు ఆస్ట్రేలియాలో కష్టాల్లో ఉన్న విద్యార్థులకు ఆహారం సమకూరుస్తూ సేవలు చేస్తున్నాడు.

ఈ విషయంపై వార్నర్ స్పందిస్తూ... తాను శ్రేయస్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపాడు. కొవిడ్‌-19 వల్ల నెలకొన్న పరిస్థితుల్లో అతను చాలా మంచి సేవ చేస్తున్నాడని ప్రశంసించాడు. అవసరమైన వారికి ఆయన భోజన సదుపాయం కల్పిస్తున్నాడని తెలిపాడు. శ్రేయస్‌ చేస్తోన్న సేవకు అభినందనలని అన్నాడు. తను చేస్తోన్న సేవల పట్ల‌ అతడి తల్లిదండ్రులతో పాటు భారత్ మొత్తం గర్వపడుతోందని పేర్కొన్నాడు. ఈ మంచిపనులను శ్రేయస్ ఇలాగే కొనసాగించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా కలిసే ఉన్నామని చెప్పాడు.


More Telugu News