యాదాద్రి భువనగిరి జిల్లాలో.. కారులో పేలుడు పదార్థాల కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలో.. కారులో పేలుడు పదార్థాల కలకలం
  • బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతా పూర్‌ వద్ద ఘటన
  • పేలుడు పదార్థాలను కారులో తరలించాలనుకున్న వ్యక్తులు
  • ఇద్దరి అరెస్టు.. ఒకరి పరారీ
  • 3,000 ఎలక్ట్రికల్ డిటోనేటర్ల స్వాధీనం 
యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు పదార్థాల కలకలం చెలరేగింది. బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతా పూర్‌ వద్ద పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు ఈ పేలుడు పదార్థాలను కారులో తరలిస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా ఈ ఘటన బయటపడింది.

ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా మరో వ్యక్తి తప్పించుకుని పోరిపోయాడు. నిందితుల నుంచి ఏకంగా 3,000 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు, పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News