హిందువుల నమ్మకాలు, సంస్కృతి నాశనం అయ్యేవరకు అందరం ఇలాగే ఉందాం!: నాగబాబు వ్యాఖ్యలు

  • కశ్మీర్ లో  హిందు పండిట్ అజయ్ అనే సర్పంచిని చంపేశారు
  • ఫరవాలేదు హిందూ పండిటే కదా అని భారతీయుల భావన
  • మనచుట్టం కాదు మన స్టేట్ కాదు.. అనుకుంటున్నారు
  • ఎక్కడో నల్లజాతి వ్యక్తిని చంపితే మాత్రం ఇండియాలో స్పందించారు
ఎక్కడో నల్లజాతి వ్యక్తిని చంపితే ఇండియాలో కూడా స్పందించారని, కానీ, మన దేశంలో జరుగుతోన్న అన్యాయాలపై మాత్రం స్పందించడం లేదని జనసేన నేత నాగబాబు అన్నారు.

'నాకు నిన్నే తెలిసింది కశ్మీర్ లో  హిందు పండిట్ అజయ్ అనే సర్పంచిని చంపేశారు. ఫరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా.. చస్తే మనం ఎవరం ఫీల్ అవ్వక్కరలేదు. ఎక్కడో కశ్మీరీ పండిట్.. మనచుట్టం కాదు మన స్టేట్ కాదు.. ఎక్కడో నల్లజాతి వ్యక్తిని చంపితే ఇండియాలో కూడా స్పందించారు.  

కానీ, ఇది ఇండియా కదా ఈ సో కాల్డ్ మీడియా, సెక్యూలరిస్టులు స్పందించక్కరలేదు. కనీసం హిందువులకి , హిందు సంస్థలకయినా బాధ్యత ఉండాలి కదా. మన రక్తం గడ్డకట్టుకొని పోయింది. ఈ దేశంలో హిందువుగా పుట్టటం కన్నా ఒక గాడిదగా పుట్టటం బెటర్ అని ఎవరో మహానుభావుడు అన్న మాట నిజమేమో అనిపిస్తుంది.
 
మొన్న కొందరు సాధువులని చంపేశారు, ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలని కవర్ చెయ్యని హిందువుల హత్యలు ఎన్నో.. అజయ్ హత్యకి కారకులని వెంటనే పట్టుకొని వాళ్లని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. హిందు మతం, హిందువుల నమ్మకాలు, హిందువుల సంస్కృతి, ఇలాగే నాశనము అయ్యేవరకు అందరం ఇలాగే ఉందాం. నాకు తెలిసి హిందు దేశంలో ఆఖరి హిందువు చక్రవర్తి సామ్రాట్ పృథ్విరాజ్. ఇంకా అక్కడ్నుంచి మనం మహమ్మదీయ చక్రవర్తులు పాలనలో నలిగిపోయాం.. బ్రిటిష్ పాలనలో నలిగిపోయాం.

స్వాతంత్ర్యం వచ్చాక కూడా బ్రిటిష్ ఏజెంట్ల పాలనలో నలిగిపోయాం. ఇప్పుడిప్పుడే అన్ని మతాలను సమానంగా చూసే ఒక పార్టీ పాలనలో ఉన్నాం, కానీ వీళ్లు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నట్లుగా ఉంది. హిందు సంస్కృతిని కాపాడుకుందాం. ఈ విషయంపై మోదీజీ ఆలోచించాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు' అని నాగబాబు తన ట్వీట్ల ద్వారా పేర్కొన్నారు.


More Telugu News