భారత్-నేపాల్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఒకరి మృతి.. నలుగురికి గాయాలు
- కయ్యానికి కాలు దువ్వుతోన్న నేపాల్
- సోన్‌బర్బా సహిద్దులోని జానకీనగర్ వద్ద కాల్పులు
- అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు
- భద్రత కట్టుదిట్టం
భారత్ ఆక్రమించుకున్న భూభాగాన్ని వెనక్కి తెచ్చుకుంటామంటూ వ్యాఖ్యలు చేస్తోన్న నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇండో-నేపాల్ సరిహద్దుల వద్ద ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల వద్ద నేపాల్ పోలీసులు కాల్పులకు పాల్పడడంతో ఓ భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
అంతేకాదు, నేపాల్ పోలీసుల కాల్పుల్లో మరో నలుగురు స్థానికులకు గాయాలయ్యాయి. సోన్‌బర్బా సహిద్దులోని జానకీనగర్ వద్ద ఈ కాల్పుల కలకలం చెలరేగింది. అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు సరిహద్దుల వద్ద మోహరించాయి. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. చైనా ప్రోత్సాహంతోనే నేపాల్ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది.