తొలి రోజు వెంకన్నను దర్శించుకున్న 8 రాష్ట్రాల భక్తులు!

  • తెలంగాణ నుంచి వెళ్లిన 142 మంది
  • మొత్తం 6,998 మందికి స్వామి దర్శనం
  • వీలును బట్టి సంఖ్యను పెంచుతామన్న వైవీ సుబ్బారెడ్డి
గురువారం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనాలు సామాన్య భక్తులకు ప్రారంభం కాగా, తొలి రోజున 8 రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు.   తెలంగాణ నుంచి 142 మంది భక్తులు స్వామి దర్శనానికి వచ్చారని, తమిళనాడు, కర్ణాటక, మ‌హారాష్ట్ర‌, న్యూఢిల్లీ, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, ప‌శ్చిమ‌ బెంగాల్‌ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. మొత్తం 6,998 మందికి దర్శనాలు చేయించామని అన్నారు. వీరంతా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లను ధరించి, స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

కాగా, నేడు వెంకన్నకు అభిషేకం నిర్బహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, త్వరలోనే దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతామని, ఈ విషయంలో ఏ మాత్రమూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. అలిపిరి వద్ద ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.


More Telugu News