ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఇంట్లో 8 మందికి కరోనా

  • బాత్రా తండ్రి నుంచి మిగతా వారికి సంక్రమణ
  • ఈ నెల 26 వరకు అందరూ హోం క్వారంటైన్
  • క్వారంటైన్ ముగిశాక అందుబాటులో ఉంటానన్న బాత్రా
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ ధ్రువ్ బాత్రా ఇంట్లో 8 మంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకినట్టు తెలిపారు. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు పేర్కొన్నారు. ఈసారి చేయించుకునే పరీక్షల్లో నెగటివ్ అని తేలితే వారం రోజుల తర్వాత మరోమారు పరీక్షలు చేయించుకుంటామన్నారు.

విషయం తెలిసిన అధికారులు వీరందరినీ రెండు వారాలపాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు హోం క్వారంటైన్ చేశారు. క్వారంటైన్ ముగిసిన తర్వాతి రోజు నుంచీ ఐఓఏ కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా బాత్ర పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ తొలుత బాత్రా తండ్రికి సోకగా, ఆ తర్వాత బాత్రాతోపాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గార్డులు, అటెండరు వైరస్ బారినపడ్డారు.


More Telugu News