దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 10 వేలను మించిన కేసుల నమోదు
- గత 24 గంటల్లో దేశంలో 10,956 మందికి కొత్తగా కరోనా
- అదే సమయంలో 396 మంది మృతి
- మొత్తం కేసులు 2,97,535కి చేరిక
- మృతుల సంఖ్య 8,498
భారత్‌లో కరోనా వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో తొలిసారిగా కరోనా కేసులు ఒక్కరోజులో 10 వేల మార్కును దాటాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,956 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 396 మంది మరణించారు. ఇప్పటి వరకు ఒకరోజులో సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం.
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,97,535కి చేరగా, మృతుల సంఖ్య 8,498కి చేరుకుంది. 1,41,842 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,47,195 మంది కోలుకున్నారు.