కరోనా లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత టెస్టు చేయించడమే బెటర్: అధ్యయనం

  • జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధన
  • 67 శాతం నెగటివ్ ఫలితాలు
  • అధ్యయనంలో భాగంగా 1,330 మంది రోగుల నమూనాల విశ్లేషణ
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కాకుండా మూడు నాలుగు రోజులు ఆగి పరీక్షలు చేయించుకోవడం మంచిదని ఓ అధ్యయనం పేర్కొంది. లక్షణాలు కనిపించిన వెంటనే చేయించుకుంటే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 1,330 మంది రోగుల నమూనాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయంలో ఓ నిర్ధారణకు వచ్చినట్టు శాస్త్రవేత్త లారెన్ కౌసిర్కా తెలిపారు.

కోవిడ్ రోగులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతులోని ద్రవాలను సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయన్నది కూడా నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగా వైరస్ సోకిన నాలుగు రోజుల తర్వాత పరీక్ష చేస్తే 67 శాతం ఫలితాలు నెగటివ్‌గా వచ్చినట్టు తెలిపారు. అయితే, లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ వైరస్ సోకినట్టుగానే భావించి చికిత్స చేయాలని సూచించారు.


More Telugu News