నా ఫ్యాన్స్ కు ఓ విజ్ఞప్తి: హీరో సూర్య
- అగరం ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి పేదలకు సాయం
- పేదలకు మరింత సాయం చేయండి
- బాధ కలిగించే పనులను చేయవద్దన్న సూర్య
అగరం ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి, పేదలకు సాయం చేస్తున్న సౌతిండియా స్టార్ సూర్య, ఇప్పుడు కరోనా సమయంలోనూ తన సేవా నిరతిని చాటుకున్నారు. తాజాగా, తనను అభిమానించే వారిని ఉద్దేశించి ఓ లేఖ రాస్తూ, ఈ కష్ట కాలంలో తన ఫ్యాన్స్ నిరంతరం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని, ఇదేమీ సాధారణ విషయం కాదని అన్నారు.
పేదలకు ఎంతవరకూ సాయం చేయగలరో అంతవరకూ సాయం చేయాలని ఫ్యాన్స్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు బాధ కలిగించే పనులు మాత్రం చేయవద్దని సూర్య కోరారు. కొందరు ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నారని, సాధ్యమైనంత వరకూ ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ సమయంలో తన ఫ్యాన్స్ చేస్తున్న పనులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు.