తెలంగాణలో కరోనా బారినపడుతున్న అధికారులు.. యాదాద్రి సీఈవో దంపతులకు సంక్రమించిన మహమ్మారి
- ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్న అధికారులు
- స్వీయ గృహ నిర్బంధంలో మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబం
- హైదరాబాద్ రైల్వేలో రెండో కేసు
తెలంగాణలో కరోనా రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. అధికారులు ఒక్కొక్కరుగా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న యాదాద్రి సీఈవోకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. ఆయన భార్య కూడా జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్టు యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. దీంతో తాను కూడా వారం రోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు. మరోవైపు, హైదరాబాద్ రైల్వే డివిజన్ కార్యాలయం హైదరాబాద్ భవన్‌లో సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారి కూడా కరోనా బారినపడ్డారు.
ఆమెను కలిసిన 9 మంది రైల్వే అధికారులు, ఉద్యోగులను గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా రైల్వే అధికారులు ఆదేశించారు. వారం రోజుల క్రితం ఓ రైలు గార్డుకు కరోనా సోకగా, ఇది రెండో కేసు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తన డ్రైవర్‌కు కరోనా సోకడంతో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబం కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లింది.