ఈ నెల 16 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు... నోటిఫికేషన్ విడుదల
- మరికొన్నిరోజుల్లో బడ్జెట్ సమావేశాలు షురూ
- రాష్ట్ర క్యాబినెట్ లోనూ నిర్ణయం
- సభ ఎన్నిరోజులు జరపాలో నిర్ణయించనున్న బీఏసీ
ఏపీలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు షురూ అవుతాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. అంతకుముందు, బడ్జెట్ సమావేశాలపై రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అయితే సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్నది ఇంకా ఖరారు కాలేదు. దీనిపై బీఏసీ సమావేశం కానుంది. ఆపైనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం పొందనుంది. గత మార్చిలోనే ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.